అబ్బో .... ఇంకా ఓపెనింగ్ కూడా కాకముందే ..... రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారా ....??
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఇప్పటికే 60 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని అనంతరం మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా స్టోరీని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసిన వినాయక్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ సిద్ధం చేశారట. అలానే ఈ సినిమా షెడ్యూల్ కూడా ఎప్పుడెప్పుడు జరపాలి మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలి అనేది కూడా ఎక్కడికక్కడ ప్లాన్ చేసి ఉంచారని ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్స్ ఏ మాత్రం తప్పకుండా యూనిట్ కి అలానే నటీనటులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. అలానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని వచ్చే ఏడాది దసరానాడు గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. పక్కాగా ఆ రోజునే సినిమాను థియేటర్స్ లో తీసుకురావాలన్నది మూవీ యూనిట్ ప్లాన్ అట. మరి ఈ విధంగా చూసుకుంటే ఇంతవరకు ఓపెనింగ్ కూడా కాని ఈ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు అంటే మూవీ యూనిట్ ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుందో తెలుసుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.....!!