ఏంటి.. ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ భార్య భర్తలా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బాలీవుడ్ సీరియల్ కిస్సర్, మాజీ నీలి చిత్రాల తార సన్నీ లియోన్ భార్య భర్తలయ్యారు.అంతే కాదు వీరికి ఒక 20 ఏళ్ల కొడుకు కూడా వున్నాడట... ఇదేంటి వీరు మొగుడు పెళ్ళాల అని ఆశ్చర్య పోతున్నారా... అయితే ఈ విషయం చదవండి... వివరాల్లోకెళితే....  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన కుందన్‌ కుమార్‌(20) ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో ఇటీవల అతడి హాల్‌టికెట్ చూసిన బీం రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్శిటీ అధ్యపకులు, సిబ్బంది షాకయ్యారు.
విషయమేమిటంటే.. ఈ విద్యార్థి హాల్‌టికెట్‌లో కుందన్ తల్లిదండ్రుల పేర్లు సన్నీలీయోన్, ఇమ్రాన్ హష్మీ  అని ఉంది. ఇక అతని అడ్రెస్ విషయానికి వస్తే  ఆ నగరంలోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన చతుర్బుజ్ స్థాన్‌లో అతడు నివసిస్తున్నట్లుగా  ఉంది. ఈ హాల్‌టికెట్ సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇది తమ నిర్లక్ష్యం కాదని, విద్యార్థే స్వయంగా దరఖాస్తులో అలా రాశాడని అధికారులు అంటున్నారు.ఈ ఘటనపై యూరివర్శిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ‘‘దీనిపై విచారణకు ఆదేశించాం. దీనికి ఆ విద్యార్థే బాధ్యుడు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఈ పని చేసి ఉంటాడు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. ఆ హాల్‌టికెట్‌లోని ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు ద్వారా ఆ విద్యార్థి ఆచూకీ తెలుసుకుంటాం’’ అని తెలిపాడు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: