చిరుతో త్రివిక్రం.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్..!
చిరుతో సినిమా అది కూడా త్రివిక్రం డైరక్షన్.. ఇక ఆ కాంబోకి తిరుగు లేదనుకోండి. చిరు చేయబోయే ఈ సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రం డైరక్షన్ లో చిరంజీవి ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది కాని అది కుదరలేదు. ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న స్టార్ హీరోలతోనే త్రివిక్రం సినిమాలు చేస్తున్నాడు.
త్రివిక్రం చిరు సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడని.. మెగా మల్టీస్టారర్ చేసే సత్తా త్రివిక్రం కు మాత్రమే ఉందని అప్పట్లో సుబ్బిరామిరెడ్డి ఎనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎవరు ప్రస్థావించలేదు. ఇక లేటెస్ట్ గా చిరు కోసం ఓ లైన్ అనుకున్నాడట త్రివిక్రం. లైన్ ఓకే అనుకుంటే మెగాస్టార్ కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తాడని అంటున్నారు. తప్పకుండా చిరు, త్రివిక్రం కాంబో ఇండస్ట్రీ హిట్ సినిమా వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది.. ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి.