మరోసారి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన సింగర్.. కారణం ఇదే..?

Satvika
నవ సమాజం సిగ్గుతో తల దించుకునే లా ఆడవాళ్ళ పై , అభం శుభం తెలియని పసి కందుల  పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.అందుకే అంటారు సమాజం సిగ్గుతో చచ్చిపోతుంది.. అలాంటిది ప్రభుత్వం ఎన్ని చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న కూడా మృగాలల్లో మానవత్వం లేదు.. క్షణ కాలం శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గుజరాత్‌లో ఇటీవల ఓ హాస్టల్ వార్డెన్ అమ్మాయిల పట్ల వికృత చర్యలకు పాల్పడిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే జరిగిందంటూ సింగర్ చిన్మయ్ బయటపెట్టింది. మీటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న చిన్మయి వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్‌మీడియా ద్వారా బయటపెడుతున్నారు..


హైదరాబాద్ లో కూడా మృగాలు వయసు తో సంబంధం లేకుండా కామంతో ప్రవర్తిస్తున్నారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఘటనను బాధితురాలు వివరాల ప్రకారం తెలియ జేసింది. ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఇది చాలు అంటూ చిన్మయి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది..



బాధితురాలి కథనం ప్రకారం ‘నేను 2015లో పదో తరగతి చదివేదాన్ని. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటూ అక్కడే హాస్టల్‌లో ఉండేదాన్ని. అక్కడ వార్డెన్ అమ్మాయిలను చాలా ఇబ్బందులు పెట్టేది.. నెలసరి వచ్చింది అని చెప్పినా కూడా వినేది కాదు... చూపించననేది..నాకు అనుకోకుండా క్లాసులో ఉన్నప్పుడు డేట్ వచ్చింది. అక్కడ క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను..కానీ హాస్టల్ వార్డెన్ మాత్రం లోనికి అనుమతించలేదు.. పైగా నిజమా, కదా అని చూపించ మంది దాంతో నేను చూపించాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..ఆ ఘటనను గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ భాధవేస్తుంది అంటూ అమ్మాయి చెప్పిన మాటలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.మన సమాజంలో చీడపురుగులు ఉన్నాయి.. వారి వల్లే అమ్మాయిల ఇలాంటి ఘటనలకు గురవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: