ఆ హీరోకు అనుష్క పెద్ద ఫ్యాన్ అట... ఎందుకో తెలుసా..?
కానీ ఒక బాలీవుడ్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించకుండానే ఈమె సంపాదించింది. బాహుబలి దెబ్బకి ఈమె క్రేజ్ ఖండాంతరాలు దాటి పోయింది. ఈ దెబ్బకి బాలీవుడ్లో కూడా ఆమెకు చాలా మంది అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే ఈమె బాలీవుడ్లో ఒక స్టార్ హీరోకి భీభత్సమైన అభిమాని అట. ఆయన అంటే పడిచచ్చే అంత ప్రేమ ఉందట. ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా మరెవరో కాదు, సల్మాన్ ఖాన్.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె బాలీవుడ్లో ఎప్పుడో ఒక సినిమా చేయాల్సి ఉన్నా బాహుబలి ఆఫర్ రావడంతో దానిని వదులుకొని ఈ సినిమా చేసింది. ఈ సినిమాకు క్రేజ్ రావడంతో డైరెక్ట్ బాలీవుడ్ సినిమా నటించకుండా ఖండాంతర ఖ్యాతి ని సంపాదించింది. ఇక ఆమె బరువు తగ్గించుకోలేక సినిమాలు తగ్గించుకుంది అంటూ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఆ కథనాలకు ఈమె స్పందించి ఏమైనా సినిమాలు ప్రకటిస్తుందో లేక నిజంగానే ఆమె సినిమాలకు దూరం అవుతుందో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.