మన హీరోల దెబ్బకు ఆ హీరోల్లో..!

NAGARJUNA NAKKA
బాలీవుడ్‌ స్టార్లు బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటలేకపోతున్నారు. ఖాన్స్‌ ఒక్కహిట్ అని తిరుగుతోంటే, హృతిక్ రోషన్‌ లాంటి హీరోలు మెప్పించలేకపోతున్నారు. దీంతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర వ్యాక్యూమ్ క్రియేట్ అవుతోంది. ఈ సిట్యువేషన్‌ని వాడుకోవడానికి నార్త్‌కి వెళ్తున్నారు సౌత్‌ హీరోలు.
షారుఖ్‌ ఖాన్‌ 'జీరో' ఫ్లాప్‌ తర్వాత మళ్లీ కనిపించలేదు. సల్మాన్ ఖాన్ 'భారత్, దబాంగ్ 3' లాంటి యావరేజ్‌ మూవీస్‌తో స్లో అయ్యాడు. ఇక ఆమిర్ ఖాన్ 'థగ్స్‌ ఆఫ్ హిందుస్తాన్' డిజాస్టర్‌తో డల్ అయ్యాడు. హృతిక్ రోషన్‌ లాంటి వాళ్లు ప్రేక్షకులని శాటిస్‌ఫై చేయలేకపోతున్నారు.
నార్త్‌ ఆడియన్స్ కూడా సౌత్‌ స్టోరీస్‌కి ఇంప్రెస్ అవుతున్నారు. అందుకే మన కమర్షియల్‌ మూవీస్‌కి అక్కడ సూపర్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిట్యువేషన్‌ని వాడుకుంటూనే నార్త్‌లో 'కె.జి.ఎఫ్.'ని రిలీజ్ చేసి, క్రేజీ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యశ్. ఇప్పుడు 'కె.జి.ఎఫ్.2' తో ఈ క్రేజ్‌ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
తమిళ్ లో యూనిక్ స్టోరీస్‌తో సెపరేట్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న ధనుష్‌, హిందీలోనూ స్టార్డమ్ సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికే హిందీలో 'రాంజాన, షమితాబ్' సినిమాలు చేసిన ధనుష్, ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్ మార్కెట్‌ సంపాదించాలనుకుంటున్నాడు. అందుకే తమిళ్‌కీ, హిందీకి వేర్వురుగా కాకుండా, పాన్‌ ఇండియన్‌ మూవీసే చెయ్యాలనుకుంటున్నాడట ధనుష్. 'రాచ్చసన్' ఫేమ్‌ రామ్‌ కుమార్ డైరెక్షన్‌లో ఒక పాన్‌ ఇండియన్‌ మూవీ చేస్తున్నాడు ధనుష్.
మొత్తానికి మన హీరోలు నార్త్ మార్కెట్ పైనే ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియన్ మూవీస్ చేస్తూ ఉత్తరాదిన జెండా పాతేస్తున్న్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ లో ఒకింత ఆందోళన నెలకొంది. బాక్సాఫీస్ దగ్గర వాళ్ల ప్రయోగాలు ఉడకడం లేదు. సౌత్ కమర్షియల్‌ మూవీస్‌కి నార్త్ ఆడియన్స్ దాసోహమైపోతున్నారు. రామ్‌ కుమార్‌తో ధనుష్ పాన్‌ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నాడు. 'కె.జి.ఎఫ్'తో కన్నడ స్టార్ యశ్ నార్త్‌కి వెళ్లాడు. మరోవైపు ప్రభాస్ వరుసగా పాన్‌ ఇండియన్‌ మూవీస్‌ చేస్తున్నాడు.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: