వైష్ణవ్ తేజ్ తో క్రిష్ చేసిన సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందా..?

shami
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాకుండానే సెకండ్ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ అందుకున్నాడు. సుకుమార్ పర్యవేక్షణలో వచ్చిన ఉప్పెన ఎలాగు హిట్ అవడం పక్కా అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా క్రిష్ డైరక్షన్ లో చేశాడు. లాక్ డౌన్ లోనే సినిమా మొత్తం పూర్తి చేసి శభాష్ అనిపించారు.

వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. క్రిష్ ఈ సినిమాను కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కించాడని తెలిసిందే. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల కథా స్పూర్తితోనే ఈ సినిమా చేశాడు క్రిష్. ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేసినా సినిమా కంటెంట్ పరంగా సూపర్ అంటున్నారు. అంతేకాదు సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని టాక్.

ఉప్పెనతో హిట్ కొట్టి ఆ తర్వాత క్రిష్ సినిమాతో వైష్ణవ్ తేజ్ సత్తా చాటుతాడని అంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడితే మెగా ఫ్యామిలీ హీరోల్లో వైష్ణవ్ తేజ్ కూడా మరో స్ట్రాంగ్ హీరోగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సాయి ధరం తేజ్ మెగా మేనల్లుడిగా సత్తా చాటుతుండగా వైష్ణవ్ తేజ్ కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. క్రిష్ సినిమా మాత్రం వైష్ణవ్ తేజ్ లోని టాలెంట్ ను మెగా ఫ్యాన్స్ కు చేరుకునేలా చేస్తుందని అంటున్నారు. రెండు సినిమాలు క్రేజీగా వస్తుండగా ఇక వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా మెగా కాంపౌండ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక అది కూడా హిట్టైతే వైష్ణవ్ తేజ్ ను ఆపడం కష్టమే.                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: