బిగ్ బాస్ 4 : ఏంటి ఈవారం ఎలిమినేషన్ లేదా..!?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్  తో దూసుకుపోతోంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న  విషయం తెలిసిందే. మొదట ఎవరికీ తెలియని సెలబ్రెటీలు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం తో ఇక ఈ సారి షో ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత బిగ్బాస్ కెమెరాలు ఎంతో తెలివిగా.. హౌస్ లోని కాంట్రవర్సీ లను... లవ్ స్టోరీలను చూపించి బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. అంతేకాకుండా ఫన్నీ టాస్క్ లతో ప్రేక్షకులందరినీ చూపును తనవైపు తిప్పుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. వారంలో ఐదు రోజుల పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్  సందడి చేయడం ఇక వారాంతంలో నాగార్జున వచ్చి మరింత సందడి చేయించడం ఆకర్షిస్తూ ఉంటుంది.


 అయితే ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ ముగియనుంది. ఇక మరో నాలుగు వారాలు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రతి వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తూ హౌస్ లోనే సభ్యులందరినీ తగ్గిస్తూ వస్తుంది బిగ్బాస్ యాజమాన్యం. కానీ ఈ ఏడాది మాత్రం ఎలిమినేషన్ వుండదు అనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ లో జరిగే ఎలిమినేషన్ లో భాగంగా ఎవరూ ఊహించని విధంగా గతవారం లాస్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

 ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై కూడా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ వుండదు అని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఇంకా బిగ్బాస్ నాలుగు వారాలు మిగిలి ఉంది. వీరిలో ఐదుగురు ఫైనల్కు వెళ్తారు అంటే ఇద్దరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అందుకే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ లేదు అన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఈ వారం బిగ్ బాస్ షో వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: