కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉందంటే ....?

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇటీవల ఎందరో కమెడియన్స్ మనం అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఇక వారిలో కమెడియన్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కెరీర్ తొలినాళ్లలో అక్కడక్కడా పలు సినిమాల్లో చిన్న పాత్రలు వేసిన ధర్మవరపు ఆ తర్వాత పూర్తి స్థాయి కమెడియన్ గా మారి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకాభిమానుల మనసులో గొప్ప పేరు దక్కించుకున్నారు.  
ఇక కొన్నేళ్ళ క్రితం దూరదర్శన్ చానల్ లో కొన్ని కామెడీ సీరియల్స్ లో నటించి మరింత మంచి పేరు దక్కించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆపై సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. ఇక ఏదైనా సినిమాలో ధర్మవారపు టు ఉన్నారు అంటే ఆడియన్స్ పొట్ట చెక్కలు అయినట్లే అని చెప్పాలి. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ కి కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా కొన్నేళ్లు ధర్మవరపు పనిచేశారు. 2013 డిసెంబర్ 7 న ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చిత్ర పరిశ్రమలో ఆయన అందరితోనూ ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవారని ముఖ్యంగా బ్రహ్మానందం, ఆలీ వంటి వారు ఆయనకు మంచి స్నేహితులని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం భార్య వరలక్ష్మి అలానే కుమారులు మాట్లాడుతూ మొదటి నుంచి కూడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం వృత్తిపై ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని టైం ప్రకారం షూటింగ్ కి వెళ్లడం, అలానే పూర్తయిన అనంతరం పక్కాగా ఇంటికి చేరుకోవడం చేసేవారని  అలానే సినీ పరిశ్రమలో చాలా మంది ఆయనంటే ఎంతో ఇష్టపడే వారని చెప్పారు. ఇక ధర్మవరపు మరణానంతరం తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని కుటుంబంలో కలతలు రేగాయని ఇటీవల కొందరు పలు మీడియా మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేశారని అయితే తమకు ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉందని అలాగే ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగానే ఉన్నారని ఆయన భార్య వరలక్ష్మి చెప్పడం జరిగింది. ప్రస్తుతం వారి తనయుడు సినిమా రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని ధర్మవరపు ఆశీస్సులతో అలానే ప్రేక్షకాభిమానుల యొక్క దీవెనలతో అతడు రాబోయే రోజుల్లో అందర్నీ ఆకట్టుకునే నటుడిగా మంచి పేరు దక్కించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: