నెటిజన్లకు మాంచి పసందైన విందు !
లాక్‌డౌన్ లో ఇంటిపట్టునే ఉంటూ గార్డెనింగ్, కుకింగ్ వీడియోలు ట్రై చేసిన తాప్సీ ..అన్ లాక్ పిరియడ్ కోసం కాస్త గట్టిగానే ఎదురుచూసింది. అన్‌లాక్ పిరియడ్లో అవుట్ డోర్ కు సరదా ట్రిప్ వేయాలనుకుంది.కాకపోతే అప్పటికే కమిటైన సినిమాకు
డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది.దానిలో భాగంగా జైపూర్‌లో విజయ్ సేతుపతితో నటిస్తున్న సినిమా షెడ్యూల్ పూర్తి చేసింది.ఆ తర్వాతనే మాల్దీవులు ట్రిప్ వేసింది.
తాప్సీ మాల్దీవులు ట్రిప్ లో ముందుగా తన సిస్టర్స్ షగున్, ఇవనియాతో సముద్రజలాలలో సరదాగా గడిపిన మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.ఆతర్వాత ‘బిగిని షూట్’ వీడియోలో బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోయ్ హైలెట్ అయ్యాడు.దీంతో తాప్సీ ట్రిప్ ఏదో ఫ్యామిలీ కోసం చేసిన యాత్ర కాదనీ...కంప్లీట్ లవర్స్ ట్రిప్ అని నెటిజన్లు సోషల్ మీడియాలోఆ ఆట ఆడుకున్నారు.
బాలీవుడ్ అవుట్ డేటెడ్ హీరోయిన్ నేహా దూఫియా మాములుగానే వీకెండ్ వస్తే హబ్బీ అంగడ్ బేడీతో అవుట్ డోర్ ట్రిప్ లు వేస్తుంది.ప్రతిసమ్మర్ లోను కూతురుతో విదేశాలకు విహార యాత్ర చేస్తుంటారు.వైఫ్ ఏది అంటే అది కాదనుకుండా ఇచ్చే అంగడ్ ..అన్ లాక్ టైమ్లో తన వైఫ్ ను మాల్దీవులు టూర్ కు తీసుకుపోయాడు.కూతురును కూడా తీసుకుని మాల్దీవులు వెళ్ళిన నేహా అక్కడే ఫుల్ ఎంజాయ్ చేసింది.
మొత్తానికి బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్నారు తాప్సీ, నేహా దూపియా. నెటిజన్లకు మాంచి అందాల వడ్డన ఇచ్చి వాళ్లను సంతృప్తి చేశారు. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో గార్డెనింగ్, కుకింగ్, యోగా లాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.