భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు.!

NAGARJUNA NAKKA
వకీల్‌సాబ్‌ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎంతైనా లాయర్‌ కదా... లాజిక్‌గా ఆలోచిస్తున్నాడు. అందుకే సంక్రాంతి రేసు నుంచి వకీల్‌సాబ్‌ తప్పుకున్నాడనిపిస్తోంది. సంక్రాంతికి యంగ్ హీరోలు నలుగురు వస్తున్నారు. వీళ్లకు భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు.

మే 15న రావాల్సిన వకీల్‌సాబ్‌ను కరోనా అడ్డుకుంది. ఈమధ్యనే షూటింగ్‌లో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌ మొదటివారంనాటికి సినిమా పూర్తిచేసేస్తాడు. ఇక వకీల్‌సాబ్‌ సంక్రాంతికి రావాడానికి ఎలాంటి అడ్డంకి లేదు. పండక్కే వస్తే ఈపాటికి టీజర్‌ విడుదల చేసేవారు. ఇంతవరకు టీజర్ రాకపోవడం చూస్తుంటే.. వకీల్‌సాబ్‌ 2021 సంక్రాంతికి రావడం కష్టమే. పండక్కి తీసుకురావడానికి నిర్మాత దిల్‌ రాజు వెనకాడుతున్నాడు. దీని వెనుక బలమైన కారణం ఉందట.

సంక్రాంతి బరిలో దిగుతున్నామని ఇప్పటికే నాలుగు హీరోలు ఎనౌన్స్‌ చేసేశారు. నితిన్‌ రంగ్‌దే.. అఖిల్ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌.. రానా అరణ్య.. రామ్ రెడ్‌ సినిమాలు పెద్ద పండక్కి ముస్తాబవుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఇంకా థియేటర్స్ ఓపెన్‌ చేయలేదు. ఆంధ్రాలో కొన్ని థియేటర్స్ ఓపెన్‌ చేసినా.. సీట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా.. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ రన్‌ చేయడం కష్టమంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు. దీంతో.. సంక్రాంతికైనా  సినిమాలు రిలీజ్‌ అవుతాయా? అన్న కొత్త డౌట్‌ పుట్టుకొచ్చింది.

డిసెంబర్‌లో థియేటర్స్‌ ఓపెన్‌ చేస్తారని టాక్‌. దీంతో.. సాయిధరమ్‌ తేజ్‌  'సోలో బతుకే సో బెటర్‌' మూవీని డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామంటూ ఎనౌన్స్ చేశారు నిర్మాత. జనాలు హోటల్స్‌కు అలవాటు పడినట్టు.. థియేటర్స్‌ వైపు చూస్తేగానీ.. సినిమా సూపర్‌హిట్‌ టాక్‌ వస్తేగానీ... ఫిఫ్టీ పర్సెంట్‌ ఆక్యుపెన్సీ వర్కవుట్‌ కాదు.  ఒకవేళ వీకెండ్‌లో ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్‌ అయినా.. వీక్‌ డేస్‌లో కలెక్షన్‌ వీక్‌గా ఉంటే పెట్టుబడి కూడా రాదన్న భయం నిర్మాతలను వెంటాడుతోంది.

చిన్న సినిమాలు హిట్‌ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ వర్కవుట్‌ అయినా.. పెద్ద సినిమాలకు 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఉండాల్సిందేనంటున్నారు. సంక్రాంతికి 100 పర్సెంట్‌ సీట్స్‌ ఫిలప్‌ చేసుకునే వెసులుబాటు  లేదన్న సమాచారంతో.. వకీల్‌సాబ్‌ను రిలీజ్‌ ఎప్పుడో చెప్పడం లేదట. సంక్రాంతికి వచ్చే లెక్కయితే.. దీపావళికి టీజర్ రిలీజ్‌ చేసేసేవాళ్లు. సమ్మర్‌నాటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ  నిబంధన తీసేసి.. 100 పర్సెంట్ సీట్స్‌ అమ్ముకోవడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: