నాని సరసన ఆ మల్లు క్యూట్ హీరోయిన్ ఫిక్స్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. నాచురల్  స్టార్ నాని మెగాస్టార్  చిరంజీవి, మాస్ మహారాజ్ రవి తేజల తరువాత కష్టపడి ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా హీరో అయ్యాడు. నిర్మాతల పాలిట మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారారు. తన 25వ చిత్రం ‘వి’తో నిరాశపరిచిన నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అనంతరం 27వ సినిమా ‘శ్యామ్ సింగరాయ్‌‌‌’లో నటించాల్సి ఉంది. దానికి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే నాని తన 28వ సినిమాను అనౌన్స్ చేసేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వివరాలను యూనిట్ వెల్లడించింది.

నాని సరసన మలయాళీ క్యూట్ హీరోయిన్ నజ్రీయా నజీమ్‌‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. నజ్రియా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘రాజారాణి’ సినిమాలో ఆర్య ప్రియురాలిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. 'మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమా డైరెక్టర్.ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు నిర్మాతలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: