ఈ ఏజ్ లో కూడా ఇంత ఫిట్నెస్... వైరల్ అవుతున్న ప్రగతి జిమ్ వర్కౌట్స్ వీడియో....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.   ప్రగతి తెలుగులో ఒక మంచి నటి అని తెలుసు. ఎన్నో సినిమాలలో తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో  సోషల్ మీడియాలో ఎక్కువ హల్ చల్ చేసిన సినీ నటులలో  నటి ప్రగతి ఒకరు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఈ  సహజ నటి  నటించిన సినిమాల్లో హీరోలకు తల్లి, వదిన, అత్త వంటి పాత్రల్లోనే చాలా  సాంప్రదాయంగా నటిస్తూ వచ్చింది. ‘దూకుడు’ ‘ఎఫ్2’ వంటి సినిమాల్లో తన కామెడీతో కూడా అదరగొట్టింది. అయితే ఈ లాక్ డౌన్లో మాత్రం కొత్త ప్రగతిని చూపించిందనే చెప్పాలి.
షూటింగ్ లు లేకపోవడంతో ఈమె ఫిట్ నెస్ పై దృష్టి  పెట్టింది. యోగ చేస్తున్న ఫోటోలను,మాస్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను.. అలాగే ఒకానొక టైములో బైక్ నడుపుతున్న వీడియోను సోషల్  మీడియా వేదికగా  షేర్ చేసింది. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో వీడియోతో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది ప్రగతి. జిమ్ లో వర్కౌట్ లు చెయ్యడం మాత్రమే కాకుండా..రకరకాలుగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది మంది యువ నటీ మణులను ఇన్స్పైర్ చేస్తుంది. ‘ఇక నుండీ బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా నేను రెడీ’ అన్నట్టు ఈమె ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నట్టు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైనా 44ఏళ్ళ వయసులో కూడా ఇంతలా ఆమె కష్టపడుతుండడం మామూలు విషయం కాదనే చెప్పాలి.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: