బిగ్ బాస్ హౌజ్ లో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇదేం షాక్ బిగ్ బాసు..!
సుమతో అవినాష్, లాస్య ముగ్గురు కలిసి కచ్చితంగా షోని అదరగొట్టేస్తారు. ఏం చేసినా ఎలా చేసినా సుమ అదరగొట్టేస్తుంది. స్టార్ యాంకర్ గా సుమ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. అలాంటి సుమ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తే మాత్రం బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ అన్నట్టే తప్పకుండా సుమ తన వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్ మేట్స్ ను మాత్రమే కాదు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది.
ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో సుమ ఎంట్రీ కేవలం సండే ఎపిసోడ్ కోసమేనా లేక నిజంగానే సుమ హౌజ్ లోకి వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆడియెన్స్ ను ఎంటర్టైనర్ చేసేందుకు బిగ్ బాస్ చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సుమ బిగ్ బాస్ ని మరో లెవల్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. తప్పకుండా సుమ బిగ్ బాస్ సీజన్ 4ని క్రేజీగా మార్చబోతుందని చెప్పొచ్చు.