త్రివిక్రం మల్టీస్టారర్ లో మహేష్.. మరో స్టార్ హీరో ఎవరంటే..!
ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం తోనే సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే త్రివిక్రం మహేష్ కాంబో మూవీలో మరో హీరోకి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తాడని అంటున్నారు. ఆల్రెడీ వెంకటేష్ హీరోగా చేసిన సినిమాలకు త్రివిక్రం రైటర్ గా పనిచేశాడు. అయితే ఆయన డైరక్టర్ గా మారాక మాత్రం కలిసి పనిచేయలేదు.
వెంకటేష్, మహేష్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. త్రివిక్రం డైరక్షన్ లో వెంకటేష్, మహేష్ ఇద్దరు కలిసి చేస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. సినిమా తప్పకుండా అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందని అనుకోగా ఆ ప్రాజెక్ట్ కొద్దిగా వెనక్కి తగ్గేలా ఉంది. అయితే ప్రస్తుతం త్రివిక్రం రామ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు.