బిగ్ బాస్ 4 : అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడోచ్..!
ఇక ఆయన కెప్టెన్ గా అవ్వడమే ఆలస్యం హౌజ్ లో గొడవలు మొదలయ్యాయి. కెప్టెన్ గా హౌజ్ మేట్స్ లను పనులు ఇచ్చే క్రమంలో అవినాష్, మెహబూబ్ లకు బత్ రూం క్లీనింగ్ ఇచ్చాడు. అయితే దానికి హౌజ్ మేట్స్ అందరు వ్యతిరేకించారు. వారిద్దరు ఆ ఒక్క పని చేసి డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారా అని మిగతా హౌజ్ మేట్స్ అన్నారు. అంతేకాదు అభిజిత్ మీద అమ్మా రాజశేఖర్ పగ తీర్చుకుంటున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి అమ్మా రాజశేఖర్ కెప్టెన్ గా అయ్యాడో లేదో హౌజ్ లో నానా రచ్చ మొదలైంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అమ్మా రాజశేఖర్ ఈ వారం సేఫ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఇమ్యునిటీ లభించే అవకాశం ఉంది. మొత్తానికి అమ్మా రాజశేఖర్ హౌజ్ లో అందరితో ఓ ఆట ఆడుకుంటున్నారని చెప్పొచ్చు.