స్టార్ హీరో గురించి పెద్ద చర్చ..?

NAGARJUNA NAKKA
మహేశ్ బాబు, సుకుమార్ మధ్య గ్యాప్ క్లియర్ అయిందా.. స్టార్ డైరెక్టర్ తో పెట్టుకోవడం కెరీర్ కు మంచిది కాదని మహేశ్ బాబు వెనక్కి తగ్గాడా.. లేక టాప్ హీరోతో ఎందుకని సుకుమార్ కాంప్రమైజ్ అయ్యాడా.. వీళ్లద్దరిని కలిపిందెవరు.. ఇలా టాలీవుడ్ లో బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి.
రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ అయింది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి, అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చేశాడు ప్రిన్స్. ఇక మహేశ్ వెళ్లిపోగానే అల్లు అర్జున్ తో పుష్ప ఎనౌన్స్ చేశాడు సుకుమార్. దీంతో మహేశ్, సుకుమార్ మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది.
సుకుమార్ ఒక వైపు పెద్ద హీరోలని డైరెక్ట్ చేస్తూనే.. చిన్న హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చిరంజీవి మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన ని ప్రొడ్యూస్ చేశాడు సుకుమార్. ఇక ఈ సినిమా థర్డ్ సాంగ్ ని మహేశ్ బాబు లాంచ్ చేస్తున్నాడు.
సుకుమార్ సినిమా సాంగ్ ని మహేశ్ బాబు లాంచ్ చేస్తున్నాడనగానే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ క్లియర్ అయ్యిందా అని మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. ఈ రిలేషన్ కోసమే ఉప్పెన సాంగ్ లాంచ్ చేస్తున్నాడని కొంతమంది చెబుతున్నారు.
అలాగే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ చాలా తక్కువ. ఈ స్టార్ డైరెక్టర్స్ అయిదారుగురు టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు తీస్తారు. సో ఒకరికొకరితో అవసరం ఉంది. అందుకే ఆటోమేటిక్ గా గ్యాపులు ఫిల్ అవుతాయని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి సుకుమార్, మహేశ్ బాబు మధ్య త్వరలో గ్యాప్ తగ్గనుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కలయికతో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని సినిమా అభిమానులు ఊహించుకుంటున్నారు. చూద్దాం.. సినీ అభిమానులు అనుకున్నట్టు జరుగుతుందో లేదో.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: