బీచ్ లో నగ్నంగా పరిగెత్తిన బాలీవుడ్ నటుడు.. ఎందుకో తెలుసా..?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ పుట్టినరోజు వచ్చింది అంటే చాలు మునుపటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా జరుపుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా గత ఏడాది జరుపుకున్నట్లు కాకుండా కాస్త డిఫరెంట్గా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే జీవితాంతం గుర్తుండిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది కొన్ని మార్పులు చేసుకొని సాదాసీదాగానే జరుపుకుంటే మరికొంతమంది మాత్రం ఎంతో కొత్తగా ప్రయత్నించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా కొత్తగా ప్రయత్నించడం ఏమో కానీ ఆ కొత్తదనం కాస్త అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సినీ సెలబ్రిటీలు తమ బర్తడే అని ఎంతో డిఫరెంట్గా జరుపుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కొన్ని కొన్ని సార్లు పుట్టినరోజులు జరుపుకోవాలని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకు కూడా వెళుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఓ బాలీవుడ్ నటుడు ఇదే చేశాడు... తన పుట్టిన రోజునాడు గోవా బీచ్ కి వెళ్లి పుట్టినరోజు జరుపుకున్నాడు . దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పుట్టినరోజు ఫోటో చూసి అభిమానులు షాక్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.




 అతడు పుట్టినరోజు జరుపుకున్నది  నగ్నంగా పరిగెత్తుతూ. బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన 55 వ పుట్టిన రోజున ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  అందరికీ షాకిచ్చాడు. నగ్నంగా సముద్రం ఒడ్డున బీచ్లో పరిగెడుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాపీ బర్త్ డే  టూ మీ..  55 వ సంవత్సరంలో కూడా పరిగెడుతున్నాను  అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ఫోటో ని క్లిక్ మనిపించిన అతని భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసిన ఎంతోమంది షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: