దిల్ రాజు చేతిలోనించి జారిపోతున్న పవన్ కల్యాణ్..
అయితే కొత్తగా దిల్ రాజుకి ఓ తలనొప్పి వచ్చి పడింది. వకీల్ సాబ్ కి సంబంధించి పవన్ కల్యాణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారు. ఒకటి లాయర్ గా, ఇంకొకటి మధ్యవయసు వ్యక్తిగా. ఇప్పటి వరకు అధికారికంగా పవన్, లాయర్ గెటప్ విడుదలైంది. రెండో గెటప్ లో కూడా రెండు వేరియేషన్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ రెండు గెటప్స్ ని సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నారు నిర్మాత దిల్ రాజు.
గతంలో సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో వకీల్ సాబ్ నుంచి కొన్ని స్టిల్స్ అనధికారికంగా బైటకొచ్చాయి. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ మొదలవుతున్న దశలో కూడా ఇలాంటి లీకులే దిల్ రాజుని వేధిస్తున్నాయట. సినిమా కోసం ఏర్పాటు చేసిన కోర్టు సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఇది అభిమానులకు శుభవార్త. అయితే ఊహించని విధంగా వకీల్ సాబ్ కి కొత్త బెడద ఎదురవుతోందట. యథావిధిగా పవన్ కి లీక్ లతో తలనొప్పి కూడా మళ్లీ ప్రారంభమైంది. గతంలో వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభించినప్పుడు కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీటవుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన వీడియో క్లిప్ లు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. అయితే ఈ లీకుల కట్టడికి దర్శకనిర్మాతలు ఏం చేస్తారన్నదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. లీకులతో సస్పెన్స్ ఓపెనైపోతుందని నిర్మాత దిల్ రాజు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఈ రీమేక్ సినిమా మాతృకల్ని చాలామంది చూసినా.. కొత్తగా వకీల్ సాబ్ లో అదనపు సన్నివేశాలను చేరుస్తున్నారు. వీటి విషయంలో నిర్మాత దిల్ రాజు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా అది సాధ్యం కావడంలేదట.