ఆ ఇద్దరి హీరోలతో శంకర్ భారీ మల్టీ స్టారర్.....
దీంతో ఏడాది కాలంగా శంకర్ ఖాళీగా ఉన్నారు. లాక్ డౌన్ లో శంకర్ తన తదుపరి సినిమా మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక మల్టీస్టారర్ సినిమా తీయడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాది నాలుగు భాషల్లో మంచి పేరున్న శంకర్.. ఈ నాలుగు బాషల నుండి ఒక్కో స్టార్ హీరోను ఎన్నుకొని మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నారట. కన్నడ నుండి ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్.. తమిళం నుండి విజయ్ సేతుపతిలతో పాటు తెలుగు, మలయాళ భాషల నుండి ఇద్దరు స్టార్ హీరోలను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురాబోతున్నారట.
రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ గనుక కొన్ని రోజుల్లో మొదలుకాకపోతే శంకర్ ఈ మల్టీస్టారర్ ని మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటీవల శంకర్ ‘ఇండియన్ 2’ చిత్ర నిర్మాతలతో విసిగిపోయి.. సినిమా పునః ప్రారంభించకపోతే తను వేరే సినిమాను మొదలుపెడతానని హెచ్చరించారు. అందుకే ఈ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.