దీపికా కేవలం గ్లామర్ కోసమే కాదట..!

shami
నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించేందుకు ఆమె 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని అన్నారు. వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ జతగా దీపికా పదుకొనె నటిస్తుంది. అయితే కేవలం ఆమెను గ్లామర్ కోసమే కాకుండా కథలో ఇంపార్టెంట్ ఉన్న పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తుంది.
రాజుకి తగ్గ రాణి కావాలి కదా అని దీపికని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్న నాగ్ అశ్విన్ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే కాకుండా సినిమాలో ఆమెది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. ప్రభాస్ కు ఈక్వల్ రోల్ దీపికది అని అంటున్నారు. అందుకే ఆమెకి స్పెషల్ గా అనిపించి ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందట. మొత్తానికి సౌత్ లో దీపికకు ఇదో క్రేజీ మూవీ అవనుందని మాత్రం చెప్పొచ్చు. ఇక ఆమె ఉంది కాబట్టి బాలీవుడ్ లో ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ప్రమోషన్స్ చేయనవసరం లేదు.
మొత్తానికి మహానటి తర్వాత నాగ్ అశ్విన్ అంచనాలను మించి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా టైం ట్రావెల్ కు సంబందించిన కథతో వస్తుందని కొందరు అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా భారీ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: