నిఖిల్, అనుపమ కొత్త మూవీ షూటింగ్ మొదలు పెట్టిన జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్..
స్టార్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీ అంటేనే ఏదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 18 పేజీస్ అనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు ప్రేక్షకులు నుంచి అనూహ్య స్పందన లభించింది.
ఇక సక్సెస్ ఫుల్ సినిమాలతో సినీ అభిమానుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మల్లూబ్యూటీ అనపమ పరమేశ్వరన్ ఎంపకైంది. నిఖిల్, అనుపమ జోడి, అలానే వారి ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆద్యంతం ఆభిమానుల్ని ఆకట్టుకునే రీతిన రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు సూర్య ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైంది, హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు చెప్పారు. ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..