లక్ అంటే ప్రభాస్ దే..!

NAGARJUNA NAKKA
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి బాలీవుడ్‌లో పెద్ద రచ్చ జరుగుతోంది. నెపోటిజం, ఫేవరెటిజం నుంచి మొదలై ఈ వ్యవహారం డ్రగ్స్‌ దగ్గరికి చేరింది. ఈ ఇష్యూస్‌తో బాలీవుడ్‌ గిలగిల్లాడుతోంటే, ట్రేడ్‌ పండిట్స్‌ మాత్రం ప్రభాస్‌కి కలిసొస్తోంది అంటున్నారు. బాహుబలికి భారీగా సంపాదించుకునే అవకాశమొచ్చిందని కామెంటుతున్నారు.
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాక బాలీవుడ్‌లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎక్కువైపోయింది. బీటౌన్‌లో వారసులకే అవకాశాలు వస్తున్నాయని, టాలెంట్‌ ఉన్నోళ్లని తొక్కేస్తున్నారని కంగనారనౌత్‌ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. ఇదే సోషల్‌ మీడియాలోనూ కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన చాలామంది స్టార్స్‌పై నెగటివిటీ పెరిగిపోతోంది.
ఆలియా భట్‌కి సూపర్ పెర్ఫామర్‌ అనే ఇమేజ్‌ ఉంది. కానీ సుశాంత్‌ సింగ్‌ చనిపోయాక ఈమెని కూడా టార్గెట్‌ చేశారు నెటిజన్లు. మహేశ్ భట్ కూతురు ఆలియా భట్‌ అనే ఇదిలో ఈమెని కూడా టార్గెట్ చేశారు. ఆలియా హీరోయిన్‌గా చేసిన 'సడక్-2' ట్రైలర్‌కి లక్షల్లో డిస్‌లైక్స్ వచ్చాయి. సినిమాపైనా బోల్డన్ని నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి.
ఆలియా భట్‌ ఒక్కతే కాదు కపూర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ లాంటి వాళ్లు, బాలీవుడ్‌ని దశాబ్ధాలుగా రూల్‌ చేస్తోన్న ఖాన్స్‌ కూడా ఈ నెగటివిటీని ఫేస్ చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ఖాన్స్, కపూర్స్‌తో ఉన్న కార్పొరేట్స్ బ్రాండ్‌ ప్రమోషన్స్ కోసం కొత్త ఫేసులని వెతుక్కుంటున్నారట. ఫేవరెటిజం గోలతో సేల్స్‌ పడిపోతాయేమో అనే భయంలో ఉందట. దీంతో ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌ కోసం చూస్తున్నారని ప్రచారంజరుగుతోంది.
ప్రభాస్‌కి 'బాహుబలి'తో నార్త్‌లో సూపర్‌ క్రేజ్ వచ్చింది. ఇక 'సాహో' కూడా హిందీ రీజియన్‌లో 200 కోట్లకుపైగా వసూల్‌ చెయ్యడంతో డార్లింగ్ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ క్రేజే తమకు కలిసొస్తుందని, బాలీవుడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడం ప్లస్ అవుతుందని ఫీలవుతున్నారట కార్పొరేట్స్. అందుకే చాలాబ్రాండ్స్ క్రిష్ణంరాజు వారసుడిని అప్రోచ్ అవుతున్నారని టాక్. అందుకే బాలీవుడ్‌ రచ్చ ప్రభాస్‌కి కలిసొస్తుందని కామెంట్లుపెడుతున్నారు ట్రేడ్ పండిట్స్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: