టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతవరకు చదువుకున్నారో తెలుసా..!
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన చిన్నతనం నుండే వ్యాపారవేత్త కావాలని బాగా తపన పడేవారు. ఆ తపనతోనే లయోలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ (కామర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేశారు.
అక్కినేని నాగార్జున చదువులో మేటి అని చాలా మంది అంటుంటారు. అందుకు నిదర్శనంగా అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిలుస్తోంది. అక్కినేని నాగార్జున మద్రాస్ లో ఇంజినీరింగ్ చదువును పూర్తి చేశారు. నాగార్జున ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ని అమెరికా దేశంలోని మిచిగాన్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా బాధ్యతలు వ్యవహరించడంతో పాటు వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు. 60 ఏళ్ళ వయసులో కూడా ఎన్నో అవకాశాలతో ఆయన దూసుకెళ్తున్నారు.
సింహరాశి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ చదువు విషయంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంబిబిఎస్ చదువు పూర్తి చేసి డాక్టర్ గా కూడా కొంత కాలం పనిచేశారు. యాక్టర్ కావాలన్న ఆశతో ఈ డాక్టర్ తన వైద్య వృత్తికి స్వస్తి చెప్పారు.
బొమ్మరిల్లు ఫేమ్ హీరో సిద్దార్ధ్ భారత రాజధాని ఢిల్లీలో డిగ్రీ వరకు చదివారు. కిరోరి మాల్ కాలేజీలో సిద్ధార్థ్ బీకాం చదువును పూర్తి చేసి అలాగే ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఎంబీఏ లో అతను మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
ఇకపోతే హీరో నారా రోహిత్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివారు. అనంతరం న్యూ యార్క్ సిటీలో కొంతకాలం ఉండి ఫిలిం కోర్సులు చేశారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఎంబీఏ కంప్లీట్ చేశారు. అక్కినేని అఖిల్ తన చిన్నతనం నుండే విదేశాల్లో విద్యనభ్యసించారు. కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ సౌత్ ఫ్లోరిడాలో డిగ్రీ పూర్తిచేసి హాలీవుడ్ లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు. కళ్యాణ్ రామ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివారు. అక్కినేని నాగ చైతన్య బీకామ్ చదువుకున్నారు. అనంతరం లండన్ లోని మ్యూజిక్ కాలేజీలో కీ బోర్డు నేర్చుకున్నారు.