త్రిష ఇంస్టాగ్రామ్ అకౌంట్..హ్యాక్ అయిందా...?

VAMSI
త్రిష తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన వయసు నాలుగు పాదులయినా ఇప్పటికీ అదే అందంతో కుర్రకారులో మరింత జోరును పెంచుతోంది.  తమిళ్ లో సినిమాలను చేస్తూ అడపా దడపా తెలుగులోనూ చేస్తూ వస్తోంది. సాధారణంగా ఇప్పుడు ప్రతిఒక్కరూ మనుషులతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారు. అయితే అందులోనూ ఇంస్టాగ్రామ్ లో అయితే సినీతారలంతా ఉంటారు.  మన త్రిష కూడా ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ  ఆక్టివ్ గా ఉంటూ పోస్టులను చేస్తూ ఉంటుంది.

ఇటీవల కొన్ని రోజులుగా త్రిష ఇన్ స్టా వేదికగా పలురకాల ఆసక్తికరమైన పోస్టులను షేర్ చేస్తోంది. అయితే తనకు ఏమైందో తెలియదు కానీ తాజాగా తాను షేర్ చేసిన స్టోరీస్ ని వరుసగా తొలగిస్తూ వస్తోంది. దీంతో ఒక్కసారిగా త్రిష అభిమానుల్లో డౌట్ మొదలైంది. ఆమె అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా?  లేక త్రిషనే ఇన్ స్థా నుంచి నిష్క్రమించిందా? అని అనుమానించారు. అయితే తాను డిజిటల్ డిటాక్స్ కింద వున్నానని అసలు పోస్ట్ ల కంటే ఎక్కువగా కథల్ని పంచుకుంటున్నానని తెలియడంతో ఇన్ స్టాలో తాను పోస్ట్ చేసిన కథల్ని తొలగించానని త్రిష స్పష్టం చేసింది.

త్రిష ఇచ్చిన సమాధానంతో అభిమానుల్లో నెలకొన్న అపోహలన్నీ తొలగిపోయాయి. `96` మూవీతో తనలో హీరోయిన్ గా క్రేజ్ మరియు ఆ గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. 2018లో వచ్చిన ఈ చిత్రం దాదాపు వివిధ ప్లాట్ ఫామ్ లలో 11 అవార్డుల్ని దక్కించుకుంది. ప్రస్తుతం త్రిష `పొన్నియిన్ సెల్వర్`అనే తమిళ్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్  గా రూపొందుతున్న ఈ మూవీ ప్రారంభం కావాల్సి వుంది. అంతేకాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళంలో జీతు జోసెఫ్ రూపొందిస్తున్న `రామ్` వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి ఇక రానున్న సినిమాలలో త్రిష ఏవిధంగా ఉండనుందో..ఏ పాత్రలలో ప్రేక్షకులను అలరించనుందో వేచి చూడాలి
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: