టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాలు విజయాలతో దేశవిదేశాల్లో కూడా హీరోగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకూ పూర్తి అయింది. ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది యూనిట్.
దాని తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్న ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్ మూవీ ఆదిపురుష్ లో కూడా నటించనున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి వీలైనంత త్వరలో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసిన అనంతరం నాగ అశ్విన్ సినిమా తో పాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనేలా రెబల్ స్టార్ ప్రభాస్ ప్లాన్స్ చేస్తున్నారట.
వాస్తవానికి ఆ రెండు సినిమాల జానర్ల విషయంలో ఎంతో వేరియేషన్స్ ఉన్నప్పటికీ రెండు సినిమాల్లోని పాత్రల కోసం భారీగా బాడీ ని బిల్డప్ చేసే పనిలో ప్రభాస్ సిద్ధమైనట్లు సమాచారం. ఆ విధంగా ఓ వైపు నాగ అశ్విన్ సినిమా మరోవైపు ఆదిపురుష్ సినిమాలతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే మాదిరిగా ప్రభాస్ బాగా ప్లాన్ చేసారని, ఒకవేళ ఈ రెండు సినిమాలు కనక భారీ విజయాలు అందుకుంటే ప్రభాస్ కెరీర్ పరంగా పాపులారిటీ, క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.....!!