అవినాష్, అరియానా.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది మాష్టారు..!
ఇక అవినాష్, అరియాల మధ్య అప్పటి నుండి సంథింగ్ సంథింగ్ అని డౌట్ ఏర్పడింది. అరియానా కూడా అందరితో ఒకలా అవినాష్ లో ఒకలా ఉంటుంది. ఇక మంగళవారం కెప్టెన్సీ టస్క్ లో భాగంగా ప్రిన్సెస్ గా అరియానా, హోటల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా అవినాష్ టాస్క్ చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో అరియానా పూర్తి దృష్టి అవినాష్ మీదే పెట్టింది. అంతేకాదు అతనికే రకరకాల టాస్కులు ఇస్తుంది.
అంతేకాదు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసేందుకు అరియానాని వాడుకుంటున్నాడు అవినాష్. అరియానా కూడా అవినాష్ కు సపోర్ట్ చేస్తుంది. హౌజ్ లో జోడీలు చాలానే ఉన్నాయి. అయితే కొత్తగా అవినాష్, అరియానాలు కూడా జోడీ కుదిరేలా ఉందని తెలుస్తుంది. పైకి చెప్పక పోయినా వారి నడవడిక మాత్రం ఇది కన్ ఫాం అనేలా చేస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరి రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి.