అల్లుడి తమ్ముడి సినిమా ఏమైంది.. ఓపెనింగ్ వరకేనా..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లోనే కాదు ఏ ఇండస్ట్రీ లో అయినా వారసత్వం అనేది వుంది.. కాకపోతే టాలీవుడ్ లో అది కొంచెం ఎక్కువ వుంది.. ఒక్క హీరో వస్తే చాలు ఆ ఫ్యామిలీ నుంచి పొలోమంటూ డజను మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అవుతున్నారు. అలా చాలామంది అయినా టాలెంట్ ఉన్నవారినే ప్రేక్షకులు ప్రోత్సహించారు. టాలెంట్ లేకుంటే టాప్ హీరో కొడుకైన, తమ్ముడైన జనాలు పక్కన పెట్టేస్తున్నారు.. ఇక ఇది పక్కన పెడితే బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
 అల్లుడు శీనుతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరసగా పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా ఎట్టకేలకు రీమేక్ మూవీ రాక్షసుడుతో హిట్టు కొట్టడం ఫైనల్ గా ఊరట కలిగించింది. ఈ హిట్ తో వచ్చిన ఉత్సాహంతో బెల్లంకొండ ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టగ శ్రీనివాస్ తమ్ముడు సినిమా ఏమైందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. సాయి గణేష్ ని టాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంతో గత ఏడాది పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీని ప్రారంభించారు.
దీని తాలూకు ఫస్ట్ లుక్ స్టిల్స్ కూడా బాగానే పబ్లిసిటీ చేశారు. కొంత కాలం షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఏమయ్యిందో కానీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు ఫిలిం నగర్ టాక్. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీతో ప్లాన్ చేసుకున్న ఆ మూవీలో ఎక్కడ తేడా కొట్టిందో మరి. దీని తర్వాత మరో డెబ్యూ డైరెక్టర్ తో సాయి గణేష్ కోసం నాన్న బెల్లంకొండ సురేష్ ఇంకో సినిమా కూడా లైన్ లో పెట్టాడు. అది కూడా ప్రేమ కథనే. ఇప్పుడది కూడా చర్చల దశలోనే నిలిచిపోయేలా ఉందని తెలిసింది. ఓ వైపు అన్న శ్రీనివాస్ సినిమాల మీద సినిమాలతో దూసుకుపోతుంటే గణేష్ ఇలా ఆదిలోనే ఆగిపోవడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు..మరి గణేష్ టాలీవుడ్ ఎంట్రీ మళ్ళీ గ్రాండ్ గా లాంచ్ చేస్తారా లేదా అన్నది చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: