వై-కేటగిరి భద్రత కోరుతూ ప్రభుత్వానికి నటి లేఖ....

VAMSI

ఇటీవల సినీపరిశ్రమలో జరిగిన మరియు ఇప్పటికీ జరుగుతున్నా కాస్టింగ్ కౌచ్ అనే విషయంపై జరిగిన రభస అంతా ఇంతా కాదు. దీనివలన ఎంతోమంది మనుషుల భాగోతం బయటపడింది. అంతేకాకుండా మంచితనం అనే ముసుగులో చలామణీ అవుతున్న సినీ పెద్దల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఎంతగా హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదేకోవలోకి బాలీవుడ్ నుండి పాయల్ ఘోష్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసింది. దీనికి ఇక్కడ మీటూ అనే పేరు కూడా పెట్టారు.




ఇటీవల ప్రముఖ దర్శకుడు మరియు చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్  తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈనేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి తనకు భద్రత కల్పించాలని ఆమె న్యాయవాది ద్వారా వై-కేటగిరి భద్రతను కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు లేఖ రాసింది. దీనితో పాయల్ ఘెష్ యొక్క న్యాయవాది నితిన్ సాట్పుట్ ఈరోజు తన ట్విట్టర్ ఖాతాలో ఈ లేఖను పంచుకున్నారు. ఇందులో నిందితుడు "స్వేచ్ఛగా తిరుగుతున్నాడు" ఇంకా అరెస్టు చేయబడలేదు అని పాయల్ ఘోష్ పేరుతో రాసిన లేఖ సంచలనమైంది. అందులోనే నిందితుడు తనకు హాని కలిగించవచ్చని తన జీవితం ప్రమాదంలో ఉందని నటి పేర్కొనడం అత్యంత సంచలనంగా మారింది..

అయితే ఈ లేఖలో పాయల్ ఘోష్ న్యాయవాది సాట్పుట్ "ఈ రోజు 5/10/2020న పాయల్ ఘోష్ భద్రత కోసం న్యాయవాది నితిన్ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు" ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కొద్దిరోజులక్రితం ఈమె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోసారిని కూడా భద్రత కోసం అడిగింతలు తెలిసిందే.  అయితే ఎప్పటిలాగే నటి పాయల్ ఘోష్ చేసిన అన్ని ఆరోపణలను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఖండించారు. ఇందుకు ప్రతిగా దర్శకుడు కశ్యప్ పోలీసుల ముందు అబద్దం చెప్పాడని పాయల్ ఆరోపించింది. ఆయనకు నార్కో ఎనాలిసిస్ లైడిటెక్టర్ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయాలని నటి ఆరోపించడం బాలీవుడ్లో మరింత దుమారాన్ని రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: