సారా అలీఖాన్ తో సమయాన్ని కేటాయించినపుడు సౌకర్యవంతంగా ఉంటాను...!

Suma Kallamadi
ఎక్కువగా మనం తల్లికి కూతురికి మధ్య ఎక్కువ ప్రేమ మంచి రిలేషన్ షిప్ ని చూస్తాం. సహజంగా పిన్నితో పోల్చితే అమ్మ తోనే ఎక్కువ ప్రేమగా ఉంటూంటాం. కానీ ఇక్కడ ఈ  ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలు రూటే వేరు. వీళ్ళు మాత్రం వేరు. అసలు ఏమైంది.. ? ఎందుకు..? అని అనుకుంటున్నారా...? అయితే వీళ్ళ రిలేషన్ ని ఇప్పుడే చూడండి. మీరు కూడా ఒప్పుకోక తప్పదు.

బాలీవుడ్ అందాల తారలు కరీనాకపూర్‌, సారా అలీఖాన్ వరుసకు పిన్నీ-కూతురు రిలేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అయితే ఒకరి పైన మరొకరికి ఎంత ప్రేమ అంటే మాటల్లో చెప్పలేం.  కరీనా, సారా బయట కూడా ఎక్కడ కనిపించినా ఒకరి పట్ల మరొకరు చాలా గౌరవంగా ఉంటారు. అలానే  ఏమైనా సందర్భం జరిగితే ఒకరినొకరు ప్రశంసించుకుంటారు. ఇలా ఇవన్నీ మనం గమనించే ఉంటాం. ఒక  ఈవెంట్ లో కరీనా కపూర్ ను రిపోర్టర్ ఇలా ప్రశ్నించాడు....  మీరు సారాకు ఎలాంటి చిట్కాలు చెబుతుంటారు? దానికి కరీనా ఇలా అన్నారు.... సారాకు సంబంధించిన చాలా నిర్ణయాలను స్వాగతిస్తానని చెప్పింది. కరీనా కపూర్ ఫేవరెట్ రేడియో షో 'వాట్ ఉమెన్ వాంట్‌'కు సారా ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం విశేషం అనే చెప్పాలి.

అలానే కరీనా కపూర్ కి  సారా అలీఖాన్ తో సమయాన్ని కేటాయించినపుడు తనకు ఎంతో  సౌకర్యవంతంగా ఉంటుందని ఆమె చెప్పింది. మొత్తానికి స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌, అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ పిన్నీ-కూతురు రిలేషన్ షిప్ లో ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తారు. ఇందులో సందేహం ఏమి లేదు. ఇవన్నీ ఇలా ఉండగా  కరీనా కపూర్ తో స్నేహపూర్వకంగా మెలిగితే  నాన్న సైఫ్ అలీఖాన్ ఎంతో ఆనందంగా ఉంటారని, ముఖంలో చిరునవ్వు చూస్తున్నానంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది సారా‌.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: