లవ్ ఇన్ సింగపూర్ సినిమాలో ఆసక్తికరమైన విశేషాలు ఇవే....
రంగనాథ్, చిరంజీవి, లత తెలుగులో నటించగా... మలయాళంలో ప్రేమ్ నజీర్, సైమన్, లత నటించారు. సింగపూర్ అందాలను వెండితెరపై అందంగా చూపించడం ఎంతో అద్భుతం అని అందుకే ఈ చిత్రం తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అని ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి చెబుతూనే ఉంటాడు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ సాగింది. విదేశాల్లో చిరంజీవికి అదే మొదటి షూటింగ్. తనే క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన మూడు చిత్రాలు విడుదల కావడం విశేషం.
కాళీ, తాతయ్య ప్రేమ లీలలు ఈ మూడు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. ఇవి పూర్తి అయ్యాక లవ్ ఇన్ సింగపూర్ రిలీజై మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులంతా సింగపూర్ వారే. ఈ సినిమా ప్రివ్యూ మద్రాసు లోని మీనా థియేటర్లో చూసి చిరంజీవి కారులో బయటకు వస్తుంటే తనని కమలహాసన్ చూశారు. మెగాస్టార్ మాత్రం చూడలేదు. కమల్ పరిగెత్తి చిరు కారుని ఆపినా చిరు గమనించలేదు. కానీ తర్వాత చిరు కమల్ ఇంటికి వెళ్లి సరదాగా కొంతసేపు గడిపాడట.