బిగ్ బాస్ 4 : అబ్బా ప్లీజ్ అలా తిట్టకే.. హౌజ్ లో గంగవ్వతో అవినాష్ కామెడీ..!

shami
బిగ్ బాస్ హౌజ్ లో జబర్దస్త్ అవినాష్ తన కామెడీతో అలరిస్తున్నాడు. జోకర్ అంటూ అవినాష్ ఎంట్రీ అదిరిపోగా అప్పటి నుండి హౌజ్ లో సందడి మొదలైంది. హౌజ్ లో అందరిని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న అవినాష్ గురువారం ఎపిసోడ్ లో గంగవ్వతో చేసిన కామెడీ సూపర్ అనిపించుకుంది. ఉక్కు హృదయం టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులంతా కొద్దిగా రిలాక్స్ అయ్యారు. ఈ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మర్ గా నోయల్ జైలుకి వెళ్ళాడు.
ఇదిలాఉంటే ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక గంగవ్వతో ఏదో మాట్లాడుదామని వెళ్తాడు అవినాష్ అయితే గంగవ్వ నాకు నిద్రొస్తుంది అంటుంది. అయితే కొద్దిసేపు మాట్లాడు అంటే ఆమె తన భాషలో తిడుతుంది.. అయితే అప్పుడు అవినాష్ అబ్బా అలా తిట్టకే అంటాడు. ఆమె దగ్గరకు వెళ్ళి ఓ ముద్దు ఇవ్వు అంటాడు.. గంగవ్వ ఇవ్వనంటుంది. అంతేకాదు ఇంకా తిట్టడం పెంచుతుంది.. సర్లే ఇక పడుకో అంటూ ఆమెకు బ్లాంక్ సీట్ కప్పబోతాడు. ఇలా ఫన్నీగా సాగింది.  
ఉక్కు హృదయం టాస్క్ లో గంగవ్వ కూడా తన బాధ్యతగా బాగా ఆడింది. ఇక అవినాష్ అమ్మా రాజశేఖర్ ను మాటల్లో పెట్టి ఛార్జింగ్ ఎక్కించుకున్నందుకు హర్ట్ అయ్యారు రాజశేఖర్. అందుకు అవినాష్ సారీ చెప్పినా సరే సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. అయితే టాస్క్ పూర్తయ్యాక మళ్ళీ ఇద్దరు కలిశారు. అంతేకాదు ఉక్కు హృదయం టాస్క్ లో టాప్ 4 బెస్ట్ ప్లేయర్ గా అవినాష్ స్థానం సంపాదించుకున్నాడు. ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారన్నది శుక్రవారం తెలుస్తుంది. కెప్టెన్ గా అర్హత సాధించిన వారిలో అభిజిత్, అవినాష్, హారిక, గంగవ్వ ఉన్నారు.
                                           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: