బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది. మంచి కథలతో సినిమాలు చేస్తారు. ఎంతవరకు హీరోయిన్ ను చూపించాలో అంతవరకు చూపిస్తారు.అలాగే హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తారు.ఇప్పుడు మాత్రం ఆ అభిప్రాయాన్ని పోగొట్టేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో డ్రగ్స్ సరఫరా, వినియోగం పై అనేక మంది ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరి పేరు బయట వస్తుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సినిమాలకు బదులు రచ్ఛలు బాగా ఫేమస్ అవుతున్నాయి. ముఖ్యంగా లైంగిక వేదింపులు ఎదుర్కొన్న బ్యూటీస్ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.ఇప్పుడు మరొక నటి కూడా ఓ ప్రముఖ వ్యక్తిపై ఆరోపణలు చేసింది..ఇలా రోజుకు ఒకరు బయటకు రావడం పై సినీ పరిశ్రమలోని పెద్దలు తీవ్ర చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలోనే హాట్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా మరొక సెలబ్రెటీపై సంచలన ఆరోపణలు చేసింది. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కో ఫౌండర్ అనిర్భన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలంగా మారాయి.
అయితే పోయిన ఏడాదిలో సినిమాలో నటించే ఛాన్స్ కోసం అనిర్భన్‌ను కలిసిందట..అతను లోపలికి వెళ్ళగానే పైకి కిందకు చూసాడు... దాంతో షెర్లిన్ ఏమైంది సార్ నా డ్రెస్ బాగోలేదా అని అడిగింది. కాదు.. నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా` అని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో నేను షాకై బయటికి వెళ్లిపోయాను’ అని షెర్లిన్ చెప్పుకొచ్చింది. నా వక్షోజాలు నిజమైనవా కదా అన్నది అతనికి ఎందుకు? ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మళ్లీ అతను ఒక మంచి స్థానంలో ఉన్నాడు అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాటలు వైరల్ అవుతున్నాయి.