బిగ్ బాస్ : సీజన్ వన్ లోనే వచ్చేదాన్ని.. కానీ అందుకే తప్పుకున్నా..?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ చూపును  ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ దూసుకుపోతుంది మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 4. ఇటీవలే ఆల్ ఇండియా లోనే అత్యధిక రేటింగ్ తో దూసుకుపోయింది ఈ షో. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రారంభం అవ్వగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే గతవారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. తరచూ కరాటే కళ్యాణి హౌస్ మేట్స్ తో గొడవలు పడటం... ఊరికే ఏడవటం  లాంటివి చెయ్యడం తో ప్రేక్షకుల ఓట్లను దక్కించుకోలేకపోయింది. దీంతో బిగ్బాస్ సీజన్ 4 హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.



 కరాటే కళ్యాణి  బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలను కూడా ఇస్తున్నారట కరాటే కళ్యాణి. అయితే కరాటే కళ్యాణి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో కనీసం ఒక నాలుగు వారాల పాటు ఉంటాను అనుకోని భావించారట. లాక్ డౌన్ సమయంలో ఎలాంటి షూటింగ్స్ లేని నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత గుర్తింపు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో హౌస్ లోకి వచ్చారట కరాటే కళ్యాణి. అయితే ఇటీవలే ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. 2017 లో మొదలైన మొదటి సీజన్ బిగ్ బాస్ షో లోనే కరాటే కళ్యాణి పాల్గొనాల్సి ఉందట.



 మొదటి సీజన్ కోసం ఎంపిక చేయబడ్డ కంటెస్టెంట్స్ లో కరాటే కళ్యాణి కూడా ఒకరు అనే టాక్ వినిపిస్తోంది. ఇక చివరికి మొదటి సీజన్ లో  బెస్ట్ కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసి కరాటే కళ్యాణి ని హోల్డ్ లో పెట్టారట . అదే సమయంలో ఒక వేళ కరాటే కళ్యాణి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మేము షోలో పాల్గొనము  అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి స్వయంగా చెప్పుకొచ్చారని తెలుస్తోంది. అందువల్లే తాను కూడా బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి తప్పుకున్నాను  అంటూ తెలిపిందట కరాటే కళ్యాణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: