మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తిన ఆ తమిళ నటీ ఎవరో చూడండి...

frame మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తిన ఆ తమిళ నటీ ఎవరో చూడండి...

Purushottham Vinay
సినిమా రంగంలో ఇవాళ ఒక్క భాషలో నటిస్తూ పోతే చాలదు. మార్కెట్‌ను పెంచుకోవాలంటే పలు భాషా చిత్రాల్లో నటించాలి. మాతృభాషల నుంచి ఇతర భాషలోకి తమ మార్కెట్‌ను విస్తరించుకుంటూ కథానాయికలుగా రాణిస్తున్నారు.
అదే విధంగా నటి జననీ అయ్యర్‌ నటిగా తన పరిధిని పెంచుకోవాలని ఆశ పడుతోంది. అచ్చ తమిళ అమ్మాయి అయిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది హీరోయిన్స్ కి మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాల సందర్భాలలో వెల్లడించారు.ఇప్పుడు ఈ జాబితా లోకి జననీ అయ్యర్‌ కూడా చేరింది. మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని మాటని బయట పెట్టారు. తెలుగు సినిమాల గురించి మరియు మహేష్ బాబు మీద తనకున్న అభిమానాన్ని తెలిపింది. తను మహేష్ గురించి ఏమందో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూడండి.

"నిజం చెప్పాలంటే తెలుగు చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అన్ని చిత్రాలు చూస్తాను. చాలా మంది హీరోలంటే ఇష్టం. ముఖ్యంగా మహేష్ బాబుకు నేను అభిమానిని. ఆయనంటే ఇక్కడి అమ్మాయిలకు చాలా ఇష్టం. మహేష్ అన్ని సినిమాలని తప్పకుండా చుస్తాను.ఆయన ఫెంటాస్టిక్ యాక్టర్ ఆండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మహేష్ బాబు పర్ఫెక్షనిష్ట్. వంద శాతం డెడికేషన్ ఉన్న యాక్టర్. హి ఈజ్ సూపర్ చార్మింగ్. మహేష్ తో నటించాలన్న కోరిక ఉంది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను.మంచి కధ దొరికితే తప్పకుండా తెలుగు లో కూడా నటిస్తాను. అయితే తెలుగు లో నాకు మేనేజర్‌ లేరు"అని చెప్పింది.  అని ఈ తమిళ నటీ సూపర్ స్టార్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిచింది."జననీ బెలూన్‌" చిత్రంతో తన సత్తా చాటుకుంది. తమిళం లో తన నటనకు మంచి పేరుని సంపాదించుకుంది.

ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: