ఎన్నికల ఫలితాల వేళ ఆశ్చర్యoగా మారిన త్రిష హడావిడి !

Seetha Sailaja
ఒక వైపు ఎన్నికల ఫిలితాల వార్తల కోసం ప్రజలు ఆశక్తి గా ఛానల్స్ ను చూస్తూ ఉంటె మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్‌ త్రిష తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి మందు కొట్టి రగడ చేసిందని వచ్చిన వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇటీవల మే 4వ తేదీన త్రిష బర్త్ డే సందర్భంగా తన స్నేహితులైన నయనతార, అమలా పాల్, రమ్య కృష్ణ, శింబుతో పాటు పలువురిని పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్రిషకు ముందు నుండి పార్టీ కల్చర్‌కు అలవాటు పడిన హీరోయిన్ గా పేరుంది. ఇటువంటి విషయాలలో హీరోయిన్స్ కు సంభందించిన వార్తలు వస్తే తమ రేటింగ్స్ కోసం చానల్స్ వాటిని పూర్తి గా సద్వినియోగం చేసుకుంటాయి. హీరోయిన్స్ తాగడం విషయం పెద్ద న్యూస్ కాకపోయినా త్రిష విషయంలోమాత్రం మీడియా ఈ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడానికి కారణం గతంలో ఆమె తాగి వివాదాల్లో చిక్కుకోవడమే కారణం అని అంటారు. సెలబ్రిటీలు ఇలాంటి విషయాలలో చేసే చిన్న చిన్న తప్పులు వారి కెరియర్ ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన త్రిషకు ప్రస్తుతం సరైన సినిమాలు లేకపోవడంతో ప్రజల దృష్టిలో నిలబడటానికి ఇటువంటి వార్తలే బెటర్ అని త్రిష అనుకుంటోంది కాబోలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: