మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. కామెంట్లతో నెటిజన్లు ఏమన్నారంటే..

Satvika
శ్రీరెడ్డి .. వివాదాలకు పెట్టింది పేరుగా ఈ అమ్మడు రెచ్చిపోతుంది. అమ్మాయిలను ఆదుకుంటాను అంటూ ముందుకొచ్చిన ఈమె అనవసరంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది... ఆ దెబ్బతో ఆయన ఫ్యాన్స్ చేసిన నానా హంగామకు ఇక్కడ ఉండలేక జెండా ఎత్తేసింది.. ఇలా శ్రీరెడ్డి పీడ విరగడ అయింది అనుకుంటే చెన్నైకి వెళ్ళిన ఈమె అక్కడి నుంచి కామెంట్లు చేస్తూ వచ్చింది.


ఒక్క తెలుగు వాళ్ళనే కాకుండా అన్నీ ఇండస్ట్రీలోని పెద్దలను టార్గెట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలలో కొనసాగుతున్న డ్రగ్స్ పై మరోమారు నోరు విప్పింది.తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది డ్రగ్స్ వినియోగిస్తుంటారని, వారి పేర్లు బయటపెడితే చర్చ మామూలుగా ఉండదని చెప్పింది. స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌసుల్లో రేవ్ పార్టీలు జరుగుతుంటాయని, అక్కడికి వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వాడుకుంటారంటూ ఆరోపించింది.. ఈ చిత్ర పరిశ్రమలో ఎవరి బ్రతుకు ఏంటో నాకు పూర్తిగా తెలుసు అంటూ అమ్మడు రెచ్చిపోయింది.


టాలీవుడ్ పెద్దలపై గతంలో తాను చేసిన ఆరోపణల వల్ల కెరీర్ నాశనం చేసేశారని, ఒక్క సినిమాలో కూడా తనకు ఛాన్స్ ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.. చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా ఛాన్సులు ఇవ్వలేదని ఆరోపించింది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు, తెలంగాణ ప్రభుత్వం తనకు సహకరిస్తే... టాలీవుడ్‌ లో అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్న వారి రహస్యాలను బయట పెడతానని ఆమె అన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని అందుకు మేము సహకరిస్తామని అంది. బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కేసును చేదించాలని అంటుంది. భయపడితే ఇలా చాలా మంది చనిపోతారు అని పేర్కొంది. స్పందించిన నెటిజన్లు ముందు నీది నువ్వు కడుక్కో తర్వాత వాళ్ళది కడగొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: