వెబ్ సిరీస్ తీయనున్న యేలేటి!

Purushottham Vinay
తెలుగులో మనం చాలా మంది డైరెక్టర్ లను చూసుంటాం.  వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్ వీరందరూ కూడా కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నారు కానీ, క్రిటిక్స్ నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకోలేదు. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకొని కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేని డైరెక్టర్ లు చాలా మంది వున్నారు. అలాంటి వారిలో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు.ఈయన మంచి విజన్ వున్న దర్శకుడు. ఇప్పటిదాకా స్టార్ హీరోలతో చెయ్యలేదు కాని చేసుంటే స్టార్ డైరెక్టర్ అయ్యిండేవాడు. పెద్ద హీరోల సపోర్ట్ ఉంటే కచ్చితంగా రాజమౌళి అంత స్థాయికి వెళ్ళేవాడు చంద్రశేఖర్ యేలేటి.  క్రిటికల్ ఎక్లెయిమ్డ్ ఫిలింస్ తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. అతని సినిమాలు మ్యాగ్జిమమ్ క్రిటిక్స్ నుండి కాంప్లిమెంట్స్ అందుకున్నాయి కాని కమర్షియల్ సక్సెస్ అందుకున్నవి తక్కువ. మరి, డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్‌గా మారుతున్న చంద్రశేఖర్ యేలేటి కమర్షియల్ సక్సెస్ కొడతారో లేదో చూడాలి. అసలు వివరాల్లోకి వెళితే… ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సాహసం’ సినిమాలకు డైరెక్షన్ చేసిన చంద్రశేఖర్ యేలేటి డిజిటల్‌ వరల్డ్‌లోకి ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
అతను ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు. ‘లూజర్’ వెబ్ సిరీస్‌తో విన్నర్ అనిపించుకుని, హిట్ కొట్టిన డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. అతని డైరెక్షన్‌లో యేలేటి ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు. క్రైమ్ యాంగిల్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసిన థ్రిల్లర్ కాన్సెప్ట్ ఈ వెబ్ సిరీస్ కోసం అభిలాష్ రెడ్డి రెడీ చేశాడట. అతని ఐడియా విని ఇంప్రెస్ అయిన చంద్రశేఖర్ యేలేటి స్క్రీన్ ప్లేలో కొన్ని సజెషన్స్ ఇచ్చారట.
అరగంట డ్యూరేషన్ ఉండేలా 10 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఆల్రెడీ స్టోరీ లాక్ చేశారని, స్క్రీన్ ప్లేకి ఫైనల్ టచ్ ఇస్తున్నాని టాక్. త్వరలో ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: