సన్నీ లియోన్.. ఒకప్పుడు పోర్న్ ఫిలిమ్స్ చేసి తర్వాత మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన "జిస్మ్2" మూవీ ద్వారా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తన అందంతో అనేక మంది యువకుల మనసులు కొల్లగొట్టి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సన్నీ లియోన్ వృత్తి పట్ల చాలా మంది ఆమెను అనేక రకాలుగా ట్రోల్ చేశారు. ఒకానొక సందర్భంలో ఆమె అవి తలచుకొని బాధ పడిన సందర్భాలు వున్నాయి. కాని ఆమె మనసు సముద్రం లాంటిది. ఒక అనాధ పిల్లను చేరదీసి తన సొంత కూతురిల చూసుకుంటుంది. ఇంకా ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది.
ఇక విషయానికి వస్తే లాక్‌డౌన్‌లో కోటీశ్వరుడు, కూలివాడు అని తేడాలు లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టనష్టాలు పడుతూ వున్నారు. మనీ రొటేషన్ తగ్గింది. డబ్బు కోసం కటకటాలు పడుతున్నారు. ఈ టైమ్‌లో సన్నీ లియోన్ కొత్త కారు కొన్ని జనాలను సర్‌ప్రైజ్ చేశారు. రెండ్రోజుల క్రితం ఒకప్పటి శృంగార తార మసరేటి కంపెనీకి చెందిన కొత్త కారు కొన్నారు. దాని విలువ ఎంతో తెలుసా? సుమారు రెండున్నర కోట్ల రూపాయలు అని టాక్.
మసరేటి కంపెనీ కారు సన్నీ లియోన్ కొనడం ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆమె ఆ కంపెనీ కారు కొన్నారు. దాని విలువ కోటిన్నర. ఈసారి దానికి అప్ గ్రేడ్ వెర్షన్ కారు కొన్నారు. రెండున్నర కోట్లతో కారు కొనడం అంటే మాటలా? అదీ కరోనా కాలంలో! సన్నీ లియోన్ సంపాదనకు లోటు ఏమీ లేదు. అందుకని, కొనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజెంట్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో సన్నీ లియోన్ వుంటున్నారు.
లాక్‌డౌన్‌లో అక్కడికి వెళ్లి పిల్లలు, భర్తతో వుంటున్నారు. ఇప్పుడు అక్కడ వేసవి కాలం. సమ్మర్ కనుక సెక్సీ స్విమ్‌సూట్ వేసుకుని ఫూల్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియా సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సన్నీ లియోన్ సిగలో సరికొత్త కారు చేరిందన్నమాట.