యంగ్ రెబల్ స్టార్ తో రెబల్ స్టార్.. ఆదిపురుష్ లో కృష్ణం రాజు..?

shami
ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆదిపురుష్. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని తెలిసిందే. సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నాడు. సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా సెలెక్ట్ చేస్తున్నారట. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కృష్ణం రాజు కూడా ఉంటే ఆదిపురుష్ కు స్పెషల్ క్రేజ్ దక్కినట్టే. ఇక తెలుగు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు. ఆదిపురుష్ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. కియరా అద్వాని, కీర్తి సురేష్, అనుష్క శర్మల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో సీత ఉంటుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

సినిమాను ఎక్కువ భాగం స్టూడియోలోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు ప్రభాస్ 60 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చినట్టు చెబుతున్నారు. సినిమాలో నటించినందుకు గాను ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు టాక్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సెట్స్ మీద ఉంది. జిల్ ఫేం రాధకఋష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేశాడు ప్రభాస్. అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: