అఖిల్ కి భారీ షాకిచ్చిన మెగా డైరెక్టర్!
అయితే ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ మరొక సినిమాలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవితో కలిసి సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం గురించి మనందరికీ తెలిసిందే. అయితే అతనితో కలిసి సినిమా తీసి హిట్ సాధించాలని అఖిల్ అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేందుకు ఒప్పుకోవడంతో అఖిల్ తో సినిమా తీయడానికి అంగీకరించలేదు.
మరోవైపు అఖిల్ రెండు నుండి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడుగుతున్నారని ప్రొడ్యూసర్లు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లను సంప్రదించి సినిమా తీసేందుకు అఖిల్ అక్కినేని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆ డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి కమిట్ కాగా బిజీ షెడ్యూల్ ఉందని చెప్పి అఖిల్ తో సినిమా తీయడానికి తిరస్కరించారు. ఏది ఏదైనా కనీసం సురేందర్ రెడ్డి అయినా తనతో సినిమా తీస్తారని ఆశపడిన అఖిల్ అక్కినేనికి ఆ డైరెక్టర్ పెద్ద షాకే ఇచ్చారు.