అక్కినేని కోడలి కొత్త వ్యాపారం అదిరిపోయింది గా

Anilkumar
2010 లో ఏ మాయ చేసావే అనే సినిమా తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమాలో నాగ చైతన్య కి జోడి గా నటించి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది.తర్వాత ఈ అమ్మడు కి వరుస ఆఫర్లు రావడంతో టాలీవుడ్ లో వరుస హిట్లతో మంచి జోరు చూపించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది చేసుకుంది.ఇక రంగస్థలం సినిమా కి సమంత ఉత్తమ నటి గా అవార్డ్ సొంతం చేసుకుంది.


పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా మంది హీరోయిన్ లకు ఆదర్శంగా నిలుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ నటిగా మరో మెట్టు పైకెక్కిందనే చెప్పాలి. ఓ బేబీ అనే లేడీ ఓరియెంట్ సినిమా లో నటించింది.అయితే ఈ అక్కినేని వారి కోడలు ఇప్పుడు మరో రంగంలోకి ఎంట్రి ఇస్తుంది. 'సాకీ వరల్డ్' పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది సమంత.. దీనికి సంబంధించిన కొత్త ఔట్ లేట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. సాకీ వరల్డ్ లో ధరలు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. మీరందరూ దీన్నీ ఇష్టపడుతారు" అని సామ్ ట్వీట్ చేసింది.


ఇటీవలే సమంతా తన ఇంటి మేడ పై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు కూడా పండిస్తూ ఉత్తమ కోడలి గా అక్కినేని వారి ఇంట్లో అందరి మన్ననలు పొందుతుంది. ఇక సమంత సినిమా విషయాలకొస్తే ఈమె ఓ సీనియర్ నటి  బయోపిక్ లో నటిస్తుంది.ఇక అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ  మొత్తానికి ఇప్పుడు మన అక్కినేని వారి కోడలు కొత్త వ్యాపారం లో కి అడుగు పెట్టి తన సత్తా చాటబోతుందన్నమాట.

https://twitter.com/Samanthaprabhu2/status/1302134419482841091?s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: