మహేష్ బ్యానర్ లో నటించనున్న నవీన్ పోలిశెట్టి!

Purushottham Vinay
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో కచ్చితంగా ముందు వరసలో వుండే పేరు నవీన్ పోలిశెట్టి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. అయితే ఇతను హీరో గా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతోనే. ఇతని టాలెంట్ కి  నిదర్శనం ఈ చిన్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.

గత సంవత్సరం జూన్ 21 న ఎలాంటి బూతు కంటెంట్ లేకుండా, భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయ్యి మంచి కలెక్షన్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 1 కోటి 50 లక్షల బడ్జెట్ కె నిర్మించబడి దాదాపు 21 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాని హిందీ లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నారు. ఈ సినిమా   రీమేక్ రైట్స్ ని హిందీ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. దాదాపు 2 కోట్లు పెట్టి ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుక్కుందంట. ఈ సినిమా బడ్జెట్ ఏ కోటిన్నర కాగా రీమేక్ రైట్స్ 2 కోట్లకు అమ్ముడుపోయాయంటే మామూలు విషయం కాదు. ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా జపాన్ లో  సెప్టెంబర్ 21 న విడుదల కాబోతుంది అంటే ఈ సినిమా స్టామినా ఎంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఇక ఇతని టాలెంట్ కి ఇంప్రెస్ అయినా మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నవీన్ ని హీరో గా పెట్టి సినిమాని నిర్మించబోతున్నాడట. ఈ సినిమాని తనకు సరిలేరు నీకెవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడట. ఒక చిన్న హీరో ని అతని టాలెంట్ ని గుర్తించి మహేష్ బాబు అతనికి అవకాశం ఇచ్చినందుకు గాను పలువురు మెచ్చుకుంటున్నారు. అలాగే టాలెంటెడ్ హీరో అడివి శేష్ ని కూడా హీరో గా పెట్టి మహేష్ బాబు సినిమా తీయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: