వి సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా?
ఇకపోతే జెంటిల్ మాన్ లాంటి సూపర్ సస్పెన్స్ త్రిల్లర్ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి వి సినిమానే అంతకంటే మంచిగా రూపొందించారని తెలుస్తోంది. 2 రోజుల క్రితం మోహన్ కృష్ణ ఇంద్రగంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఏ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా బాగుంటుందని... అతని పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులంతా ఫిదా అయిపోనున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
నిజానికి వి సినిమా నాని కెరీర్లో 25వ సినిమా అని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెలియదట. మొత్తం సినిమా పూర్తి చేసిన తర్వాత ఇది నాన్నకు 25వ సినిమా అని తెలుసుకుని ఆశ్చర్య పోయారట. కానీ 25వ సినిమా అయిన వి నానికి మంచి హిట్ ని తెచ్చిపెడుతుందని దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రేపు విడుదల కానున్న వి సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలియాలంటే కొంత సమయం వరకు ఆగాల్సిందే.