బండ్ల గణేశ్ అంటే కామెడీ అనుకుంటారు.. ఆయన ఎన్ని కష్టాలుపడ్డారో తెలుసా..!?
తన జీవితం గురించిన అనేక షాకింగ్ విషయాలు గుర్తు చేసుకున్నారు. బండ్ల గణేశ్‌ది చాలా కష్టాలు పడి వచ్చిన కుటుంబం. చిన్న రైతు కుటుంబం. కరెంటు కూడా లేని ఇంట్లో బతికాడు. ఏ రోజూ ఇబ్బంది పడకుండా వాళ్ల నాన్న బండ్ల గణేశ్ వాళ్లను పెంచారు. బండ్ల గణేశ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు. బండ్ల గణేశ్ ఊరికే బండ్ల గణేశ్ కాలేదు. బండ్ల గణేశ్ తనకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు. బండ్ల గణేశ్ తన నోటి తొందర వల్ల తానే నష్టపోయాడు.
బండ్ల గణేశ్ కు సినిమా అంటే ఫ్యాషన్. దాని కోసమే బతుకుతా అంటున్నాడు. తాను గొప్ప నటుడిని కాదని... అద్భుతమైన సన్నివేశం ఒక్కటీ చేసిన దాఖలాలు లేవని... అయినా వంద సినిమాలు చేశానని చెబుతున్నారు. అందరితోనూ మర్యాదగా, మంచిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందంటున్నాడు. అవకాశాల కోసం ఎదుటివాళ్లను బతిమిలాడుకోవడం, ప్రార్థించడం తప్పుకాదంటాడు బండ్ల గణేశ్ .
బండ్ల గణేశ్ ఇంకా ఏమంటున్నాడంటే.. మన కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థిస్తున్నాం కదా! ఇది కూడా అంతే. మనకు సాయం చేసే ప్రతి ఒక్కడిలోనూ దేవుడిని చూస్తేనే మనం పైకి వస్తాం. నేను ఇండస్ట్రీకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. నా తొలి సినిమా ‘ఆంజనేయులు’ కూడా అప్పు తీసుకొచ్చి చేశా. నేను చేసేది మస్కా అనుకున్నా, మాయ అనుకున్నా పర్వాలేదు అంటూ ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి నెమరు వేసుకున్నాడు బండ్ల గణేశ్.