కొత్త బిజినెస్ మొదలు పెట్టిన మాటల మాంత్రికుడు

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమలో ముందు రచయితగా పరిచయం అయ్యారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.ఆ తర్వాత దర్శకుడిగా నువ్వే నువ్వే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు .ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి దర్శకుడిగా త్రివిక్రమ్ కి మరో అవకాశాన్ని ఇచ్చేలా చేసింది .అక్కడితో త్రివిక్రమ్ అతడు,జులాయి,సన్అఫ్ సత్యమూర్తి ,జల్సా ,అత్తారింటికి దారేది ,అరవింద సామెత ,అలవైకుంఠపురం లో చిత్రాల వరుస విజయాలతో టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు .ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నారు .



కానీ ఈ లాక్ డౌన్ వాళ్ళ ఆ సినిమా ఇంకా సెట్స్ పై కి వెళ్ళ లేదు.ఎన్టీఆర్ కూడా తన rrr షూటింగ్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది .కాబట్టి త్రివిక్రమ్ అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు .ఈ లోపు త్రివిక్రమ్ ఓ ప్లాన్ వేసినట్టు లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ .అదేంటంటే మళ్ళీ త్రివిక్రమ్ రైటర్ గా మారబోతున్నాడట .ఎన్టీఆర్ rrr షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు ఆయన ఓ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ఇతర దర్శకులకి ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .ఇక త్రివిక్రమ్ గారి కథలకి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది .కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడానికి త్రివిక్రమ్ ఈ ప్లాన్ వేసాడని సమాచారం


.దీని తో ఈ లాక్ డౌన్ టైం లో కూడా త్రివిక్రమ్ భారీగా సంపాదించాలని చూస్తున్నాడట .మొత్తానికి మన మాటల మాంత్రికుడి ప్లాన్ బాగానే ఉన్న అది వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహాలు మాత్రం టాలీవుడ్ జనాలలో ఉన్నాయ్ అనే చెప్పాలి .  
ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమా విషయం లో రోజుకో వార్త సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది .ఈ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ,లేదు కంప్లీట్ కామెడీ అండ్ ఫామిలీ ఎంటర్టైనింగ్ వే లో ఉంటుందని ఇలా వార్తలు వస్తున్నాయి .మరి వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరుకు వెయిట్ చేయాల్సిందే .  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: