కీసర ఎమ్మార్వో కేసులో కొత్త ట్విస్ట్.. తెరమీదికి కలెక్టర్, ఆర్డివో..?

praveen
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో వెలుగులోకి వచ్చిన ఎమ్మార్వో ఉదంతం  తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీసర  ఎమ్మార్వో నాగరాజు భూవివాదం సెటిల్మెంట్ విషయంలో  ఏకంగా  కోటికిపైగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే కీసర ఎమ్మార్వో కేసు లో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దర్యాప్తు లో... నాగరాజు కు సంబంధించిన ఎన్నో ఆస్తులు కూడా బయట పడ్డాయి.. కాగా  ఈ కేసులో మరింత ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.

 కీసర ఎమ్మార్వో నాగరాజు వెనకాల ఎవరైనా ఉన్నతాధికారులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యం లోనే పలువురు ఉన్నత అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. కలెక్టర్ తో  పాటు ఆర్డీవో మరో తహసిల్దార్ కు కూడా కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుతో సంబంధాలు ఉన్నట్లు గా విచారణలో వెల్లడైనట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కేసులో కీసర ఎమ్మార్వో నాగరాజు తోపాటు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు రియల్టర్ల ను  కూడా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.


 కాగా  సర్వే నెంబర్ ను  మార్చి మ్యుటేషన్ చేయించే ప్రక్రియలో  ఆర్డీవో తో పాటు కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. కలెక్టర్ తో భూమి మ్యుటేషన్ చేయించే ప్రక్రియను ఆర్డీవో తో పాటు ఎమ్మార్వో చూసుకుంటారట.  ఈ విషయం ఏసీబీ అధికారుల విచారణలో తేలినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సదరు కలెక్టర్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే భూవివాదం విషయం మాట్లాడేందుకే  గెస్ట్ హౌస్ కి వెళ్లినట్లు ఎమ్మార్వో నాగరాజు అంగీకరించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: