పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలు చూడండి !

Purushottham Vinay
హీరో అంటే ఇలాగే ఉండాలి…! నాలుగు ఫైట్లు చేసేసి .. నాన్ స్టాప్ గా ఇంటర్వెల్ కు ముందు నాలుగు డైలాగులు చెప్పేసి .. పాటలు వచ్చే టైంకి హీరోయిన్ తో రొమాన్స్ చేసి ఆ పాటలో నాలుగు స్టెప్పులు వేసేసి, క్లైమాక్స్ లో ఎమోషన్ పండించాలి అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరో పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీకి కళ్యాణ్ బాబుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తరువాత పవన్ కళ్యాణ్ గా మారాడు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. సరాసరి కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.


 
కెరీర్ ప్రారంభంలో ఈయన సినిమాలు సెలెక్ట్ చేసే విధానాన్ని దగ్గర నుండీ చూసిన కొందరు సినీ ప్రముఖులు.. ‘ ఈయనకు ఏమైనా తిక్కా’ అని కామెంట్స్ చేసేవారట. కానీ అలా కామెంట్ చేసిన వాళ్ళే ఆయనకు పెద్ద ఫ్యాన్స్ గా మారిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. ఆయన సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్ళు పూర్తికావస్తోంది. అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్లో.. కొన్ని సినిమాలను ఆయన రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :


 
1) ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం

రవి తేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ముందుగా పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకున్నారంట.
 


2) ఇడియట్

ఈ సినిమాని కూడా పవన్ రిజెక్ట్ చేసాడట. తర్వాత రవితేజ హీరో గా నటించడం జరిగింది.



3) అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి

పూరి జగన్నాథ్ మళ్ళీ పవన్ ని ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడంట. ఈ సినిమాని కూడా ఆయన రిజెక్ట్ చెయ్యడం జరిగింది.

4) అతడు

త్రివిక్రమ్ అతడు కథ చెప్తుంటే పవన్ నిద్ర పోయాడట.



5) పోకిరి

ఆఖరికి సౌత్ ఇండియా ఇండస్ర్టీ హిట్ సినిమా పోకిరి కూడా పవన్ ని మెప్పించలేకపోయింది అంట. ఇక మహేష్ చేసిన ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.



6) గోలీమార్

గోపి చంద్ హీరో గా చేసిన ఈ మూవీలో ముందుగా పవన్ నే అనుకున్నారట.



ఇక తరువాత మిరపకాయ్, నాయక్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, దూసుకెళ్తా, ఆటోనగర్ సూర్య లో ముందుగా పవన్ నే హీరోగా అనుకున్నారట. కాని ఇవన్నీ పవన్ రిజెక్ట్ చేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: