సర్కారు వారి పాటలో ఊహించని ట్విస్ట్ !
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ నటించే సినిమా సర్కారువారి పాట కరోనా తగ్గగానే.. షూటింగ్ మొదలవుతుంది. గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకుడు.. కీర్తి సురేష్ హీరోయిన్. దూకుడులో ఎమ్మెల్యేగా కాసేపు కనిపించినా.. తండ్రిని బతికించుకోవడం కోసం వేసే వేషం అది. మహర్షిలో బిజినెస్‌మేన్‌గా... ఫార్మర్‌గా కనిపిస్తాడు. ఏదో కథలో భాగంగా రెండు షేడ్స్‌లో కనిపించాడే తప్ప.. అవి కథను మలుపు తిప్పే రోల్స్ కావు.
మహేశ్ సినిమాల్లో ట్విస్ట్ అంటే ముందుగా గుర్తుకొచ్చే సినిమా పోకిరి. రౌడీగా కనిపిస్తూనే.. ఒక్కసారిగా పోలీస్‌గా కనిపించి ఆడియన్స్‌లో గూజ్బంప్స్ తీసుకొచ్చాడు. మళ్లీ ఇలా.. షాక్ ఇచ్చే మలుపు సర్కారువారి పాటలో ఉందట.
'సర్కారు వారి పాట' సినిమాలో కూడా ట్విస్ట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వడ్డీ వ్యాపారిగా మహేష్ బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను లేవనెత్తేపాత్రలో కనిపిస్తాడట. షూటింగ్ నవంబర్‌లో మొదలయ్యే అవకాశముంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మహేశ్ బాబు సినినా అనగానే.. ఆయన అభిమానులు ఏవేవో ఊహించుకుంటారు. సైలెంట్ గా ఉండి.. ఆయన చేసే డైలాగ్ డెలివరీ.. ఫైట్స్.. డ్యాన్స్.. ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఆ డైలాగ్ నే నిజ జీవితంలో కూడా ఉపయోగిస్తుంటారు ఆయన ఫ్యాన్స్. అంటే అంత పాపులారిటీ డైలాగ్స్ మహేశ్ కోసం ప్రత్యేకంగా రూపొందించే రైటర్స్, డైరెక్టర్స్ ఉంటారన్నమాట.