ఎవరైనా హిట్టొస్తే సీక్వల్ తీస్తారు.. కాని ఈయన మాత్రం..?

shami
ఏ సినిమాకైనా సీక్వల్ వస్తుంది అంటే దాని అర్ధం.. ప్రేక్షకుల ఆమోదం పొందినట్టు.. సినిమా సూపర్ హిట్ అయినట్టు. కాని ఓ డైరక్టర్ చేస్తున్న సీక్వల్స్ హిట్ కాకపోయినా వరుసగా అదే టైటిల్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ అతనెవరు అంటే ఇంకెవరు మన ఓంకార్ అన్నయ్య అని తెలుస్తుంది. ఓక్ ప్రొడక్షన్ లో ఓంకార్ రాజు గారి గది మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది. హర్రర్ కామెడీతో ఆ సినిమా మంచి వసూళ్లు తెచ్చింది.

ఇక ఆ సినిమా సీక్వల్ గా రాజు గారి గది 2 నాగార్జున, సమంత లాంటి బిగ్ స్టార్స్ ను పెట్టుకున్నా వర్క్ అవుట్ కాలేదు. పార్ట్ 2 పోయినా పార్ట్ 3 తీశాడు ఓంకార్. అవికా గోర్, అశ్విన్ తో రాజు గారి గది 3 వచ్చింది. ఆ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కాని ఇప్పుడు రాజు గారి గది 4 అంటూ మళ్ళీ అదే ఫార్మెట్ కథతో వసుతున్నాడు ఓంకార్. చేస్తున్న ఈ సీక్వనెసులు సక్సెస్ అవుతుంటే అలా చేస్తూ వెళ్ళినా ఓ అర్ధం ఉంటుంది. కాని అలా కాకుండా రిజల్ట్ తో సంబందం లేకుండా తను చేసేది చేసుకుంటూ వెళ్తా అన్నట్టు ఉంది ఓంకార్ పరిస్థితి.

రాజు గారి గది 4 సినిమా కేవలం ఓటిటి కోసమే తీస్తున్నట్టు తెలుస్తుంది. హాట్ స్టార్ డిస్నీ ప్లస్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. అక్కడ లారెన్స్ లా ఇక్కడ ఓంకార్ లా ఒకే సినిమాకు సీక్వల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు. కాని అక్కడ లారెన్స్ చేస్తున్న సినిమాలన్ని హిట్ అవుతుంటే ఓంకార్ మాత్రం సరైన ఫలితాలు అందుకోవట్లేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: